లైక్స్ కోసం జీవితం: ఆన్లైన్ వాలిడేషన్ ట్రాప్
ఆ ఒక్క నోటిఫికేషన్ కోసం… రాత్రి 11 గంటలు. నీవు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పోస్ట్ చేసి పది నిమిషాలైంది. ఫోన్ లాక్ స్క్రీన్ తెరిచి, అప్లికేషన్ ఓపెన్ చేసి, నోటిఫికేషన్స్ చెక్ చేస్తున్నావు. 47 లైక్స్. చిన్న స్మైల్. మళ్లీ రెండు నిమిషాల తర్వాత చెక్ చేస్తావు. 52 లైక్స్. హార్ట్ బీట్ కొంచెం పెరుగుతుంది. “ఈసారి కనీసం 100 దాటాలి” అనుకుంటున్నావు. గత పోస్ట్‌కు 120 వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు స్లో గా…
