జెనరేషన్ గ్యాప్ వలన నీ ఆలోచనలు ఎప్పుడూ తప్పుగా అనిపిస్తున్నాయా?
మీ మాటకు విలువ లేదు అనుకుంటున్నారా? మొన్న ఆదివారం సాయంత్రం మా ఇంట్లో అందరం కూర్చుని టీ తాగుతున్నాం. నేను నా జాబ్ లో జరిగిన ఒక విషయం చెప్పడానికి ప్రయత్నించాను. కానీ నడుమలోనే మా నాన్న “ఇప్పుడు పిల్లలకు బాధ్యత అంటే ఏం తెలియదు, మన కాలంలో…” అని మొదలుపెట్టారు. మా అమ్మ మీ మామయ్య కూతురు లాగా ఆలోచిస్తే బాగుంటుంది” అన్నారు. నేను మాట్లాడటం మానేశాను. ఎందుకంటే జెనరేషన్ గ్యాప్ మళ్ళీ మన మధ్య…
