సెలవు వెళ్లలేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావని అనిపిస్తుందా?
ట్రావెల్ FOMO ఈ రోజు యువతకు
వీకెండ్. మీ ఇన్స్టా ఫీడ్ ఓపెన్ చేశారు. ఎవరో గోవాలో బీచ్ లో, ఎవరో హిమాలయాస్ లో ట్రెక్కింగ్, ఎవరో బాలీ ట్రిప్ నుంచి రీల్స్ పెడుతున్నారు. మీరు? మీ రూమ్ లో కూర్చుని ఆ పోస్ట్స్ చూస్తూ, “నేనెప్పుడు ట్రావెల్ చేస్తాను?” అని ఆలోచిస్తున్నారు.
సెలవు వెళ్లలేకపోవడం వల్ల మీరు ఫెయిల్యూర్ అనిపిస్తుందా? “అందరూ ట్రావెల్ చేస్తున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను” అనే థాట్ వస్తుందా? 2025 లో ట్రావెల్ కల్చర్ ఇంత పెరిగిపోయింది, ట్రావెల్ చేయకపోతే మనం “బోరింగ్” లైఫ్ జీవిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఎందుకు ఈ ప్రెషర్?
1. సోషల్ మీడియా గ్లామరైజేషన్
ఇన్స్టా, ఫేస్బుక్ ఫుల్లుగా ట్రావెల్ కంటెంట్. ఎవరైనా ట్రిప్ వెళ్లడం అంటే 50 పోస్ట్స్, 100 స్టోరీస్. వాళ్ళ ఎక్స్పెన్సెస్ తెలియవు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు – కానీ గ్లామరస్ లైఫ్ కనిపిస్తుంది.
2. పీర్ ప్రెషర్
“మన గ్రూప్ అందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, నువ్వు కూడా రా” – నాకు బడ్జెట్ లేదు అని చెప్పడం కష్టం. వెళ్లకపోతే గ్రూప్ నుంచి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
3. “లైవ్ యువర్ బెస్ట్ లైఫ” ప్రెషర్
YOLO (You Only Live Once) కల్చర్. “యంగ్ గా ఉన్నప్పుడు ట్రావెల్ చేయాలి”, “ఎక్స్పీరియన్స్ మేటర్” – ఇలాంటి మెసేజెస్ ఎక్కడ చూసినా. ట్రావెల్ చేయకపోతే లైఫ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
రియాలిటీ చెక్
నా ఫ్రెండ్ పూజ చెప్పింది – “నేను రెండు సంవత్సరాలు ట్రావెల్ చేయలేదు. ఫ్యామిలీ కోసం సేవ్ చేస్తున్నాను, కెరీర్ బిల్డ్ చేస్తున్నాను. మొదట్లో FOMO ఉండేది. కానీ ఇప్పుడు అర్థమైంది – ప్రతి ఒక్కరికీ వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి.”
నిజమే కదా! ట్రావెల్ అంటే లగ్జరీ, కానీ నెసెసిటీ కాదు. మీరు ట్రావెల్ చేయకపోతే మీ లైఫ్ వాల్యూ తగ్గదు.

అందంగా అనిపించిన భావాన్ని పదాల్లో మార్చే నైపుణ్యం, ప్రతి వాక్యంలో తలపోసే సున్నితత్వం… ఇవే సంజన రాతల్లో ప్రత్యేకత. ప్రేమ, నమ్మకం, ఒత్తిడిలాంటి భావోద్వేగాల్ని నిండుగా చెప్పేలా, కానీ చదివినవాళ్ల గుండె నొప్పించకుండా రాయడమే ఆమె శైలి. ఆమె వాక్యాల్లో తడిచినపుడు, మీ జీవితపు చిన్న మజిలీ గుర్తొస్తుందనిపించకమానదు.
