చిన్న చిన్న విషయాలకే ఓవర్ గా ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటున్నారా? దీనికి చెక్ పెట్టండిలా!
ఆఫీసులో బాస్ ఏదో చిన్న మాట అన్నారని రోజంతా అదే ఆలోచిస్తూ కూర్చున్నారా? లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు “నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది” అని రాత్రంతా నిద్రపోకుండా గడిపేశారా? అసలు జరగని విషయాలను ఊహించుకుని, భయపడిపోతూ టెన్షన్ పడుతున్నారా? వెల్కమ్ టు ది క్లబ్! దీన్నే మనం ముద్దుగా ‘ఓవర్‌థింకింగ్’ (Overthinking) అని పిలుచుకుంటాం. నిజానికి ఆలోచించడం తప్పు కాదు. కానీ అవసరానికి మించి ఆలోచించడం, చిన్న విషయానికి కూడా భూతద్దం వేసి చూడటమే అసలు…
